Share News

బి ఫామ్ ఎవరికో?

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:34 PM

మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామి నేషన్ల స్వీకరణ శుక్రవారం సాయంత్రం ముగి సింది.

బి ఫామ్ ఎవరికో?
మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంగా మహబూబ్ నగర్ లో ర్యాలీ నిర్వహిస్తున్న వివిధ పార్టీల నాయకులూ, కార్యకర్తలు

- నామినేషన్లు వేసి ఎదురుచూస్తున్న ఆశావహులు

- అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

- పలు డివిజన్లలో ఇద్దరు, ముగ్గురు పోటీ

- 42 మందితో జాబితా విడుదల చేసిన బీజేపీ

మహబూబ్‌నగర్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామి నేషన్ల స్వీకరణ శుక్రవారం సాయంత్రం ముగి సింది. కానీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ ఎస్‌ పార్టీలు ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రక టించలేదు. చాలా డివిజన్లలో పోటీ అధికంగా ఉండటంతో అభ్యర్థులను ఖరారు చేయకుండా, నామినేషన్‌ల గడువు ముగిసేవరకు రెండు పా ర్టీలు వేసిన రాజకీయ ఎత్తుగడ సక్సెస్‌ అయిం ది. అభ్యర్థుల పేర్లు ముందే ప్రకటిస్తే, టికెట్‌ రాని వారు ఇతర పార్టీల నుంచి పోటీకి దిగుతా రన్న ఉద్దేశంతో చివరి వరకు పేర్లు ప్రకటించ కుండా దాటవేత దోరణి అవలంభించాయి. అయితే చాలా మంది అభ్యర్థులకు మాత్రం నామినేషన్‌లు వేసుకోవాలని ముఖ్య నాయకులు సూచనప్రాయంగా చెప్పారు. టికెట్‌ వస్తుందన్న ధీమా ఉన్నా, బీఫామ్‌ సమర్పించేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉండటం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అప్పటివరకు రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో? ఎవరు ఎలాంటి పైరవీలు చేస్తారోనన్న భయం లోలోన ఉంది. వచ్చేనెల 3వ తేదీ లోగా పార్టీలు బీఫారంలు సమర్పించేందుకు గడువు ఉండటం తో ప్రధాన పార్టీలు అదే రోజు సమర్పించాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఒక్క బీజేపీ మాత్రమే మొదటి విడతగా 42 మంది అభ్యర్థులను ప్రకటించింది. దాదాపు వారికే బీఫారంలు కూడా దక్కనుండటంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్‌ లేదు. వారు ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో టికెట్‌ల విషయంలో జరుగుతున్న జాప్యం కారణంగా తమకు ప్రచారానికి సమయం తక్కు వగా ఉండే అవకాశం ఉంటుందని అభ్యర్థులు భయపడుతున్నారు. ముందుగా టికెట్‌లు ఖరా రు చేసి ఉంటే ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టే వారమన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 49 వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖరారు చేయ డం నాయకులకు సవాల్‌గా మారింది. మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ సతీమ ణి ప్రసన్న, రాఘవేందర్‌రాజు సతీమణి వసంత ఇద్దరూ ఇదే డివిజన్‌ నుంచి దరఖాస్తు చేసుకు న్నారు. ఇప్పుడు ముఖ్య నాయకులకు ఇదే తలనొప్పిగా మారింది. బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం డివిజన్ల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులను పిలి చి, వారికి సర్వే వివరాలు వెల్లడిస్తున్నారు. సర్వే లో ఎక్కువ శాతం వచ్చిన వారికే టికెట్‌ ఇస్తున్న ట్లు తెలిపి, మిగతా వారు పార్టీ నిర్ణయించిన అభ్యర్థి విజయానికి పని చేయాలని చెప్తున్నారు.

సిట్టింగ్‌లకు సీటు దక్కేనా ?

కార్పొరేషన్‌ పరిధిలో ఇది వరకు 49 వార్డు లలో ఉన్న సిట్టింగ్‌ కౌన్సిలర్లు తిరిగి పోటీ చేసేం దుకు ఉత్సాహం చూపిస్తూ నామినేషన్‌లు కూ డా దాఖలు చేశారు. ఇప్పుడు వారిలో ఎంత మందికి ఆయా పార్టీలు టికెట్‌లు ఇస్తాయో రెండు రోజుల్లో తేలిపోనున్నది. కాంగ్రెస్‌ పార్టీలో పోటీ ఎక్కువగా ఉన్నందున పలువురికి మొండి చేయి తప్పదన్న ప్రచారం సాగుతోంది. బీఆర్‌ ఎస్‌లో ఇద్దరు సిట్టింగులు పోటీకి దూరంగా ఉండగా, మరో ఇద్దరికి టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. బీఆర్‌ఎస్‌ నుంచి కాం గ్రెస్‌ పార్టీలో చాలా మంది కౌన్సిలర్లు చేరారు. వారిలో పలువురికి సర్వేల ఆధారంగా అవకాశం కల్పించనట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 30 , 2026 | 11:56 PM