పండుగకు వచ్చి వెళ్తుండగా.. కారు ఢీకొని బాలుడి మృతి
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:34 PM
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మం డలంలోని జాతీయరహదారిపై గురువారం జరి గిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు.
అలంపూరుచౌరస్తా, అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మం డలంలోని జాతీయరహదారిపై గురువారం జరి గిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన కురుమన్న, శివమణి దంపతులు వారి కుమారు లు నిశిత్‌కుమార్ (2), హర్షసాయితో కలిసి శివమణి పుట్టినిల్లు అయిన గద్వాల మండలం, దౌదర్‌పల్లిలో దసరా పండుగ ముగించుకుని గురువా రం బైక్‌పై తిరుగు ప్రయాణం అయ్యారు. ఉండవల్లి సమీపంలో బాబుకు నీళ్లు తాపేందుకు రోడ్డుకు కాస్త పక్కకు బైక్ నిలిపారు. శివమణి కిందకు దిగి ఉండగా తండ్రి కురుమన్న, పిల్లలు బైక్‌పై ఉండగా వెనక నుంచి ఓ కారు అతి వేగంగా ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న నిశిత్‌కుమార్ అక్కడిక్క డే మృతి చెందగా తండ్రి కురుమన్న, హర్షసాయిలకు గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.