Share News

కుమార్తెను పలకరించేందుకు వెళ్తుండగా..

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:38 PM

మహబూబ్‌న గర్‌ జిల్లా జాతీయ రహదారి జడ్చర్ల పోలీసుస్టేషన్‌ పరి ధిలోని మిషన్‌భగీర థ కార్యాలయ సమీపంలో ఆదివారం వరుస వాహనాలు ఢీ కొన్నాయి.

కుమార్తెను పలకరించేందుకు వెళ్తుండగా..
జడ్చర్ల మిషన్‌భగీరథ కార్యాలయ సమీపంలో కారుపై బోల్తా పడిన బొలెరో

- వరుస వాహనాలు ఢీకొనడంతో తల్లి మృతి

- ఐదు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

జడ్చర్ల, నవంబ రు 29 (ఆంధ్రజ్యో తి) : మహబూబ్‌న గర్‌ జిల్లా జాతీయ రహదారి జడ్చర్ల పోలీసుస్టేషన్‌ పరి ధిలోని మిషన్‌భగీర థ కార్యాలయ సమీపంలో ఆదివారం వరుస వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో చిట్టబోయిన్‌పల్లిలోని సాంఘిక, సంక్షేమ బా లికల గురుకుల పాఠశాలలో చదువుకుంటు న్న కుమార్తెను పలకరించేందుకు వెళ్తున్న త ల్లి బైండ్ల శారద (33) మృతి చెందింది. జ డ్చర్ల ఎస్‌ఐ మల్లేశ్‌ తెలిపిన వివరాల మేర కు.. హైదరాబాద్‌ నుంచి జడ్చర్ల వైపు ముం దుగా బైకు, కారు, బొలేరో, లారీ వెళ్తున్నాయి. ఈ వరుస వాహన శ్రేణిలో అట్టలను తీసుకె ళ్తున్న బొలేరోను లారీ ఢీ కొట్టింది. భూ త్పూర్‌కు వెళ్తున్న కారును బొలేరో ఢీ కొట్టి బోల్తాపడింది. ఇదే సందర్భంలో కారు పక్క నే వెళ్తున్న బాలానగర్‌ మండలం చిన్నరేవల్లి గ్రామానికి చెందిన బైండ్ల నరసింహ, బైండ్ల శారద వెళ్తున్న బైకును కారు ఢీ కొట్టింది. బై కుపై కారు పడడంతో పాటు రోడ్డు కిందకు పడిపోయింది. బైండ్లశారదపై కారు పడి అ క్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనలో బై కుపై వెళ్తున్న బైండ్ల నరసింహ, బొలెరో వా హనం డ్రైవర్‌, క్లీనర్‌లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న జడ్చర్ల పోలీ సులు 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. భారీ క్రేన్‌ను సంఘటనా స్థ లానికి తీసుకువచ్చి బోల్తా పడిన బొలెరో, కారును పక్కకు తొలగించి, శారద మృత దేహం బయటికి తీశారు. కారులో ప్రయా ణిస్తున్న భూత్పూర్‌కు చెందిన గంగాధర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహ దారిపై వరుస వాహన శ్రేణి ఢీ కొనడంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సుమారు రెండు గంటల పాటు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బైండ్ల శారద బావ బైండ్ల రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

Updated Date - Nov 29 , 2026 | 11:39 PM