రూ.3.50 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి?
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:02 PM
రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చే సిన రూ.3.50 లక్షల కోట్లు ఎక్కడికిపోయాయో వెల్లడించాలని, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చే సిన రూ.3.50 లక్షల కోట్లు ఎక్కడికిపోయాయో వెల్లడించాలని, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మునిసిపాలిటీలోని అంబేడ్కర్ కళాభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగాది, రంజాన్ పండుగల వాతావరణంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పండుగ వాతావరణంలో ఉంటుందని భావించామని, ప్రజల నెత్తిన గుండుసున్న పెట్టిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని, రైతుబంధు కో సం రైతులు ఎదురుచూశారని, అందరి నెత్తిన పెద్దగుండు వేశారని విమర్శించారు. పార్లమెంట్‌లో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.2.80 లక్షల కోట్లు అప్పు చేసిందని వెల్లడించారని, పార్లమెంట్ వెల్లడించిన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవపట్టిస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల ని ర్మాణంతో పాటుతో పాటు ఎన్నో అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. రెండున్నర సంవత్సరాలలో ప్రస్తుత ప్రభుత్వం చేసిన రూ.3.50 లక్షల కోట్లతో చేపట్టిన పనులు ఒక్కటీ చెప్పుకునేలా లేవన్నారు. తెలంగాణ మ రో శ్రీలంకలా మారడం ఖాయమని ప్రజలు భయపడుతున్నారన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు కోడ్గల్ యాదయ్య, పాలాది రాంమోహన్, ఇంతియాజ్ ఖాన్ పాల్గొన్నారు.