Share News

వరుణుడు కరుణించే..రైతు హర్షించే..

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:57 PM

నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలుచోట్ల సోమవారం, మంగళవారాలు మోస్తరు వర్షం కురిసింది.

వరుణుడు కరుణించే..రైతు హర్షించే..
అచ్చంపేట పట్టణంలో జలమయమైన ప్రధాన రహదారి

- గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం

- జలమయమైన రహదారులు

- అలంపూరులో జోరుగా పొగాకు, మిరప నాట్లు

- అక్కడక్కడ దెబ్బతిన్న పత్తి పంటలు

నాగర్‌కర్నూల్‌టౌన్‌/అచ్చంపేట/బల్మూరు/అలంపూరుచౌరస్తా, సెప్టెం బరు 22 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలుచోట్ల సోమవారం, మంగళవారాలు మోస్తరు వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ఆరుతడి పంటలకు జీవంపోసినట్లైందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మంగ ళవారం సాయంత్రం అచ్చంపేట పట్టణంలో కురిసన భారీ వర్షంతో ప్ర ధాన రహదారి జలసంద్రంగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బం దులు పడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు, ఉండవల్లి మండలాల్లో సోమ, మంగళవారాలు ఓ మోస్తరు వర్ష కురిసింది. నేల తల్లి తడిసిపొంగిపోగా వాగులు వంకల్లోకి నీరు చేరింది. రైతులు పొలం బాట పట్టారు. చిన్నపోతులపాడు, చెన్నిపాడు, పుల్లూరు, కలుగొట్ల, బొంకూరు తదితర గ్రామాలలో పొగాకు, మిరప నాట్లు వేశారు. బోరు బావుల కింద సాగుచేసిన పత్తి వర్షం ధాటికి రాలిపోయింది. నాగర్‌ క ర్నూల్‌ జిల్లాలోని ఉప్పునుంతల మండలంలో అత్యధికంగా 25.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా కల్వకుర్తి మండలం లో 24.3 మిల్లీ మీటర్లు, బల్మూరులో 20.0, అచ్చంపేటలో 16.3, తాడూరులో 9.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. లింగాల, ఊర్కొండ మండలాల్లో 4.0 మిల్లీ మీటర్లు, వెల్దండలో 3.8, పదరలో 3.5, నాగర్‌కర్నూల్‌లో 2.8, అమ్రాబాదులో 0.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా మం డలాల్లో వర్షం ప్రభావం కనిపించలేదు.

Updated Date - Sep 22 , 2026 | 11:57 PM