Share News

ఆడిందే ఆట.. పాడిందే పాట

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:41 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పౌరసరఫ రాలశాఖలో పనిచేస్తున్న ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడుస్తోంది.

ఆడిందే ఆట.. పాడిందే పాట
నాగర్‌కర్నూల్‌ స్టాక్‌ పాయింట్‌లో పాడైన బియ్యం (ఫైల్‌)

- నాగర్‌కర్నూల్‌ స్టాక్‌ పాయింట్‌లో చక్రం తిప్పుతున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి

నాగర్‌కర్నూల్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పౌరసరఫ రాలశాఖలో పనిచేస్తున్న ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడుస్తోంది. చౌకధర డిపోల ద్వారా పేదలకు అందిస్తున్న సన్న బియ్యా న్ని స్టాక్‌ పాయింట్‌ ఇన్‌చార్జీలు, వారికింద పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది దోచుకుంటున్నా జిల్లా పౌరసరఫరాలశాఖ నోరు మెదపకపోవడం తీవ్ర విమర్శ లకు తావిస్తోంది. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని పౌరసరఫరాలశాఖ గోదాములో స్టాక్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని గుప్పిట్లో పెట్టుకొని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నడిపి స్తున్న బియ్యం దందా దుమారం రేపుతోంది. ఏడేళ్లుగా అతను బహిరంగంగానే మిల్లర్లతో రేషన్‌ బియ్యం దందా నడిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

కాసులు కురిపిస్తున్న సన్న బియ్యం పంపిణీ..

పేదలకు పంపిణీ చేసే సన్న బియ్యం పథకం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అక్రమార్కులకు వరంగా మారింది. జిల్లాలో 2,78,681 రేషన్‌కార్డులు ఉండగా ప్రతీ నెల 5,70,559 మెట్రిక్‌ టన్నుల బియ్యం చౌకధర డిపోల ద్వారా సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 552 చౌకధర డిపోలు ఉండగా కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి, అచ్చంపేట, తెలకపల్లి, కొల్లాపూర్‌, పెద్దకొత్తపల్లిల్లో స్టాక్‌ పాయింట్లు ఉన్నాయి. చౌకధర డిపోల ద్వారా దొడ్డు బియ్యం సరఫరా చేసినప్పుడు లిక్కర్‌ కంపెనీలకు, కస్టమ్‌మిల్లింగ్‌కు కేజీకి రూ.10 చొప్పున రేషన్‌ బియ్యం కొనుగోలు చేసేవారు. సన్న బియ్యం పంపిణీ కొందరు స్టాక్‌ పాయింట్‌ ఇన్‌చార్జీలకు పండు గ వాతావరణం ఏర్పడింది. నాగర్‌కర్నూల్‌ స్టాక్‌ పాయింట్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి బహిరంగంగానే డీలర్లతో బేరసారాలకు దిగి మీరు రిస్కు తీసుకుని మిల్లర్లకు ఎందుకు అమ్ముతారు, కిలో బియ్యానికి రూ.18-20 చెల్లిస్తాను, గోదా ములోనే ఉంచండి ఎవరికీ అనుమానం రాకుండా ట్రక్కు షీట్‌ ఉన్న వాహనం లోనే మిల్లులకు పంపించుకుంటానని ఇటీవల 20లారీలను కల్వకుర్తి, కొల్లాపూ ర్‌, అచ్చంపేట నియోజకవర్గాల్లోని రైస్‌ మిల్లులకు పంపించినట్లు తెలుస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా తాను మేనేజ్‌ చేసుకుంటానని, మీకు ఎలాంటి ఢోకా లేదని డీలర్లకు భరోసానిచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో ఒక డీలర్‌షాప్‌కు స్టాక్‌పాయింట్‌ నుంచి వచ్చిన బియ్యం బస్తాలో రమారమిగా 5కిలోల చొప్పున తరుగు రావడం గమ నార్హం. ఇదేమిటని ప్రశ్నిస్తే స్టాక్‌పాయింట్‌ ఇన్‌చార్జి చేతులు ఎత్తేయడంతో రేషన్‌ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 16 , 2026 | 11:41 PM