చేయి తిరిగిన పని.. చేసేదెలా?
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:41 PM
ఎన్‌జీసీ కార్యక్రమంలో భాగంగా మల్దకల్‌లోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవా రం క్షేత్రపరిశీలన చేశారు.
మట్టికుండల తయారీని పరిశీలించిన పాఠశాల విద్యార్థులు
మల్దకల్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఎన్‌జీసీ కార్యక్రమంలో భాగంగా మల్దకల్‌లోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవా రం క్షేత్రపరిశీలన చేశారు. చెర్లగార్లపాడు గ్రా మానికి వెళ్లి మట్టికుండల తయారీని ప్రత్యక్షం గా పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు సీడ్‌బాల్స్ తయారీ, వాటి ద్వారా మొక్కల పెంపకం ఎలా సాధ్యమౌతుందో వివరించారు. హెచ్‌ఎం సురేశ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాము లు కావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, లోకేశ్వరి, ప్రశాంతి, పద్మ, రమణమ్మ, గీత పాఠశాల ఎకో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.