చివరి మజిలీకి చేరే దారేది?
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:40 PM
చివరి మజిలీకి దారి కరువయ్యింది. పచ్చని వరి పొలమే బాటయ్యింది. ఈ విషాద సం ఘటన గోపాల్పేట మండలంలోని పొలికెపాడ్ గ్రామంలో బుధవారం జరిగింది.
- పచ్చని పొలంలో నుంచి అంతిమయాత్ర
గోపాల్పేట, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : చివరి మజిలీకి దారి కరువయ్యింది. పచ్చని వరి పొలమే బాటయ్యింది. ఈ విషాద సం ఘటన గోపాల్పేట మండలంలోని పొలికెపాడ్ గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన మిద్దె లోకమాత అనారోగ్యంతో మృతి చెందింది. వారికి, వారి దాయాదులకు గ్రామ సమీపంలో వంద ఎకరాల పొలం ఉంది. కానీ పొలానికి వెళ్లేందు కు దారి లేదు. ముందున్న పొలా లకు చెందిన రైతు లు అందుకు ఒప్పు కోవడం లేదు. వేరే దారి లేకపోవడం తో లోకమాత అం తిమయాత్రను 20 ఎకరాల మేర వరి పొలంలో నుంచే చేపట్టాల్సి వచ్చింది. అధికారులు స్పందించి తమ పొలా లకు బాట ఏర్పాటు చేయించాలని బాధిత కు టుంబ సభ్యులు కోరారు.