Share News

ఈతకు వెళ్లి నీటిలో మునిగి..

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:03 PM

ఈత సరదా విద్యార్థి జీవితాన్ని బలి తీసుకున్న సంఘటన మల్దకల్‌ మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో చోటుచేసుకుంది.

 ఈతకు వెళ్లి నీటిలో మునిగి..

మల్దకల్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఈత సరదా విద్యార్థి జీవితాన్ని బలి తీసుకున్న సంఘటన మల్దకల్‌ మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ ప్రజలు ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నడిపి వెంకటన్న, శంకరమ్మ దంపతుల కుమారుడు జయరాజు (13) గద్వాల జిల్లా కేంద్రంలోని బాలుర హైస్కూల్‌ నందు 7వ తరగతి వి ద్యనభ్యసిస్తున్నాడు. గత కొంత కాలంగా వ్యక్తిగత ఆరోగ్యకారణాలతో హాస్టల్‌ నందు ఉండకుండా అమరవాయి గ్రామం నుంచి పాఠశాలకు వెళ్లి వస్తున్నాడు. ఇందులో భాగంగా ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లాడు. బావిలో నీరు నిండుగా ఉండటంతో నీటిలో మునిగిపోయాడు. భయపడిన స్నేహితులు విషయం గ్రామంలో తెలుపడంతో పోలీసులు స్పందించారు. స్దానిక పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. అయినా ఫలితం లభించలేదు. అగ్నిమాపక దళం నీటిని బయటకు తీయడంతో మృతదేహం బయటపడింది. కుమారుని మృతదేహం చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నుముట్టాయి. ఈ సందర్భంగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Mar 08 , 2026 | 11:03 PM