Share News

అర్ధరాత్రి టీ తాగేందుకు వెళ్ళి.. జూనియర్‌ డాక్టర్‌ దుర్మరణం

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:44 PM

నైట్‌ డ్యూటీలో అలసిపోయి టీ తాగేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఓ జూనియర్‌ డాక్టర్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.

అర్ధరాత్రి టీ తాగేందుకు వెళ్ళి..   జూనియర్‌ డాక్టర్‌ దుర్మరణం
జూనియర్‌ డాక్టర్‌ అక్షయ్‌ (ఫైల్‌)

- మహబూబ్‌నగర్‌లో అప్పన్నపల్లి బ్రిడ్జిపై మొక్కల తొట్టిని ఢీకొన్న బైక్‌

మహబూబ్‌నగర్‌/ ధన్వాడ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : నైట్‌ డ్యూటీలో అలసిపోయి టీ తాగేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఓ జూనియర్‌ డాక్టర్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మహబూబ్‌నగర్‌ పట్టణం లోని అప్పన్నపల్లి బ్రిడ్జిపై ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. దన్వాడకు చెందిన దండిగి అక్షయ్‌కుమార్‌(24) పాలమూరు నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆరు నెలల క్రితం జూనియర్‌ డాక్టర్‌గా చేరాడు. ఆదివారం నైట్‌ డ్యూటీకి వచ్చిన అతడు, అర్ధరాత్రి ఒంటి గంట వరకు డ్యూటీ ముగించుకుని టీ తాగేందుకు జడ్చర్ల వైపు బయలుదేరాడు. తన ద్విచక్ర వాహనంపై అప్పన్నపల్లి ఫైఓవర్‌ ఎక్కుతూ అదుపుతప్పి పక్కనే ఉన్న మొక్కల తొట్టిని ఢీకొనడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. గమనిం చిన పెట్రోలింగ్‌ పోలీసులు అతడిని నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న అతడిని బతికించేందుకు వైద్యులు శ్రమించారు. కానీ బ్రెయి న్‌డెడ్‌ కావడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మరణించాడు. అక్షయ్‌కుమార్‌ తండ్రి ధన్వాడలో ప్రై వేట్‌ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉండగా, ఇతడు చిన్నవాడు. ఇంకా వివాహం కాలేదు. జూని యర్‌ డాక్టర్‌గా కెరియర్‌ ప్రారంభించిన తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చని పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 10 , 2026 | 11:44 PM