Share News

శభాష్‌..

ABN , Publish Date - May 05 , 2026 | 11:38 PM

పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అభినందించారు.

శభాష్‌..
విద్యార్థులను అభినందిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే బండ్ల

  • 500కు పైగా మార్కులతో మండల స్థాయిలో ప్రతిభ

ధరూర్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అభినందించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో పీఎంశ్రీ ధరూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 500లకు పైగా మార్కులు సాధించిన 16మంది విద్యార్థులతో పాటు ధరూర్‌ మండల స్థాయిలో మొదటి, రెండోస్థానంలో నిలిచిన విద్యార్థులు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం నరేష్‌, మాజీ ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - May 05 , 2026 | 11:38 PM