సంక్షేమ వారోత్సవాలు జయప్రదం చేయాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:18 PM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాలను అధికారులు జయప్రదం చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
ప్రతీ వసతిగృహానికి ప్రత్యేక అధికారులను నియమించాలి
జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాలను అధికారులు జయప్రదం చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్ర ణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాలపై మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ వసతిగృహంతో పాటు కస్తూర్బా పాఠశాలలు, గురుకు ల విద్యాలయాల్లో మండల, జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయా రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను సజావుగా నిర్వహించి పెద్దఎత్తున ప్రచారం కల్పించాలన్నా రు. సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాల్లో విద్యా ర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఈవారోత్సవాల సందర్భంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈనెల 22న ఆయా వసతిగృహాలు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాల్లో చిన్నపాటి మరమ్మతులు ఉంటే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని చెప్పారు. 23న పేరెంట్స్ మీటింగ్, 24న విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధిపై, ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 25న సమ్మర్ క్యాంప్‌లో విద్యార్థులకు ఇచ్చే శిక్షణపై అవగాహన కలిగించాలన్నారు. చివరి రోజు 26న బడిబాట కార్యక్ర మాన్ని నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సిం గ రావు, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి నుషిత, బీసీ సంక్షేమాధికారి అక్బర్‌బా షా, డీఈవో విజయలక్ష్మి, ఇతర అధికారులు ఉన్నారు.