Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:29 PM

కాంగ్రెస్‌ హయాంలోనే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

మూసాపేట, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ హయాంలోనే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మూసాపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎం సహాయ నిధి చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌లను లబ్ధిదారులకు అందజేసి, మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల అధికారంలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని, తాము అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులు, సదుపాయాలు, భవన నిర్మాణాలతో పాటు రైతు సంక్షేమానికి అనేక పథకాలను చేపడుతున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మూసాపేటను నామమాత్రంగా మండలంగా ప్రకటించారే తప్పా చేసిందేమి లేదని ఆరోపించారు. రూ.16 కోట్ల నిధులు మంజూరయ్యాయని త్వరలోనే కాంప్లెక్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. మూసాపేట మండలంలో నాలుగు విద్యుత్‌ ఉప కేంద్రాలతో పాటు 133 కేవీ ఉప కేంద్రం శంకుస్థాపన చేశామన్నారు. జానంపేట వద్ద ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చివరి దశలో ఉందని తెలిపారు. తహసీల్దార్‌ రాజునాయక్‌, ఎంపీడీవో కృష్ణయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్‌, సర్పంచులు మహేందర్‌, ప్రవీన్‌కుమార్‌రెడ్డి, రాంచందర్‌, బగ్గి కమలమ్మ, రవిరాజాచారి, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, మండల నాయకులు ఎండీ కలీమ్‌, కృష్ణయ్య, సురేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, నిరంజన్‌, యాదయ్య, గౌతం మహవీర్‌, నారాయణ, ఖలీల్‌, ఆంజనేయులు, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 11:29 PM