ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:09 PM
నగరంలోని ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ న్యూటౌన్/పాలమూరు జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో కాలనీవాసులు సొంత ఖర్చుతో నిర్మించనున్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ముఖ ద్వారానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. విజ్నేశ్వరకాలనీలోని శివాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.8 లక్షలతో నిర్మించనున్న షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వరంగల్ నగరం తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా మహబూబ్‌నగర్ తీర్చిదిద్దుతానన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని అరుంధతి భవన్‌లో అరుంధతి బంధు సేవా సమితి క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్ గౌడ్, డీసీసీ కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు అహ్మద్‌ఖాన్, గోవర్దన్, రాములునాయక్, నర్సింహ్మరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, శంకర్, సుదర్శన్, శంకర్‌నాయక్, కృష్ణయ్య, మురళీధర్, వెంకటేశ్వర్లు, రవికుమార్, ఓంకార్ పాల్గొన్నారు.