ఆమోదయోగ్యమైన పీఆర్‌సీని సాధిస్తాం
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:10 PM
ఉపాధ్యాయులు ఆశిస్తున్న రీతిలో ఆ మోదయోగ్యమైన ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని సాధిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను ఇప్పించే బాధ్యత తనదేనన్నారు.
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
గద్వాల టౌన్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యో తి) : ఉపాధ్యాయులు ఆశిస్తున్న రీతిలో ఆ మోదయోగ్యమైన ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని సాధిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. ఆ దివారం పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్‌హా ల్‌లో పీఆర్‌టీయూ టీఎస్ జోగుళాంబ గద్వా ల జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లా డుతూ.. ఉపాధ్యాయులకు సంబంధించి పెం డింగ్‌లో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ప్రభుత్వంతో సానుకూల వాతావర ణంలో చర్చలు సాగుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో చర్చలు సఫలీకృతం కాకపోతే తమ యూనియన్ ఉ ద్యమ కార్యాచరణను ప్రకటిస్తుందన్నారు. స మావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధి కో సం నిరంతరం కృషి చేస్తూ పేద విద్యార్థుల ను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లేలా ఉపాధ్యా యులు కృషి చేయాలన్నారు. ఏ సమస్య వ చ్చినా తాను అన్నివేళలా అందుబాటులో ఉం డి తోడ్పాటునందిస్తానన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పచ్చర్ల తిమ్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పెన్షనర్ల సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, బుచ్చారెడ్డి, పర మేశ్వర్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు
పీఆర్‌టీయూ టీఎస్ నాయకులు 2026-28 పదవీ కాలం కోసం జిల్లా నూతన కార్యవ ర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ప చ్చర్ల తిమ్మారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా టి.రం గన్న, గౌరవ అధ్యక్షుడిగా వేణుగోపాల్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికా రులుగా వనపర్తి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బౌద్ద రెడ్డి, సూర చంద్రశేఖర్, గౌరవ అధ్య క్షుడు రవీంద్ర గౌడ్ వ్యవహరించారు.
జోగుళాంబ దేవి సన్నిధిలో ఎమ్మెల్సీ
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివార్లను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చి, తీర్థ ప్రసాదాలు అందించారు.