నడిగడ్డ రైతులకు సాగు నీరు అందిస్తాం
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:03 PM
రైతులకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉందని, మాటలు కాదు చేతల్లో చూపిస్తామని నాగర్‌కర్నూలు పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అన్నారు.
నాగర్‌కర్నూలు ఎంపీ మల్లురవి
ఎర్రవల్లి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రైతులకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉందని, మాటలు కాదు చేతల్లో చూపిస్తామని నాగర్‌కర్నూలు పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అన్నారు. ఎర్రవల్లిలోని సు రవరం వర్థంతి కార్యక్రమానికి వచ్చిన మల్లుర వి, మాజీ ఎమ్మెల్యే, సంపత్‌కుమార్, చైర్‌పర్సన్ సరితలకు మండల కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నెట్టెంపాడు ప్యాకేజి పనులను పూర్తి చేయాలని సాధన సమితి వినతిప త్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పనులను గ తంలో కాంగ్రెస్ ప్రభుత్వం 90శాతం పనులను పూర్తి చేసిందని గుర్తుచేశారు. కేవలం పది శా తం పనులు పూర్తి చేసేందుకు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు పట్టించుకో లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు చాలాపనులు చేసిందని, ఆర్డీఎస్‌కు సంబందించి మల్లమ్మకుంట, వల్లూరు రిజర్వాయర్లను కూడా త్వరలో పూర్తి చేసేం దుకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. సంపత్‌కుమార్ మాట్లడు తూ నెట్టెంపాడు ప్రాజెక్టు దూరదృష్టితో ఏర్పాటు చేసిందని, ఇది రెండు లక్షల ఎకరాలకు నీ రందించేదని పేర్కొన్నారు. పది శాతం పనులు చేయకుండా పదేళ్లు పబ్బం గడిపి నిర్లక్ష్యం చేసి న ప్రభుత్వం బీఆర్‌ఎస్ అని విమర్శించారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం ఉండటంతో రైతు లు విలవిల్లాడుతున్నారని, దీనిని అధిగమించేం దుకు సమీక్ష జరిగిందని, నెట్టెంపాడు, ఆర్డీఎస్ ను, పూర్తిచేసే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని భరోసా కల్పించారు. నడిగడ్డను పడావు చేసింది బీఆర్‌ఎస్ అని వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, సర్పంచ్‌లు రవిప్రకాశ్, పెద్దమద్దిలేటి, నాయకులు నర్సిరెడ్డి, వెంకటేష్‌యాదవ్, జోగుల రవి, శ్యామ్, ఈదన్ననాయుడు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.