ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాం
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:47 PM
గద్వాల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు నిబద్ధతతో కృషి చేస్తామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాలటౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): గద్వాల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు నిబద్ధతతో కృషి చేస్తామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. పట్టణాభివృద్ధి విషయంలో మునిసిపల్ కౌన్సిల్‌కు తనవంతు పూర్తి తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి పట్టణంలోని మూడవ వార్డు పరిధిలోని ప్రధాన రోడ్డు కూడలి వద్ద ఏర్పాటు చేసిన హైమాక్స్ వీధి లైట్లను మునిసిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, కనీస సౌకర్యాలైన తాగునీరు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, కాలనీల్లో అంతర్గతరోడ్డు, డ్రైనేజీ వంటి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్‌చైర్మన్ శంకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, కౌన్సిలర్ నాగులుయాదవ్, నాయకులు జనార్దన్, మురళి, ఇసాక్ ఉన్నారు.