ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందిస్తాం
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:18 PM
ఓటరు జాబితాలో వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి పూర్తి పారదర్శకతతో ఓటరు జా బితాను రూపొందిస్తామని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.
కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాలో వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి పూర్తి పారదర్శకతతో ఓటరు జా బితాను రూపొందిస్తామని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. మంగళవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాలులో పురపాలక ఎన్నికల సందర్బగా ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించా రు. ఈసమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ అభ్యంతరాలు, ఫి ర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ నాలుగు మునిసిపాలిటీలు ఉన్నాయన్నారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతీ ఓ టరును వారి నివాస భౌగోళిక పరిధి, ఇంటి నంబర్, వార్డు సరిహద్దుల ఆధారంగా సంబంధిత వార్డులోనే నమోదు చేయాలని అధికారులకు సూ చించారు. ప్రత్యేకంగా గద్వాల మునిసిపాలిటీలోని 13, 16, 17 వార్డుల అభ్యంతరాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, తహసీల్దార్ మల్లికార్జున్, ముని సిపల్ కమిషనర్లు, వివిధ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.