గిరిజనుల హక్కులు కాలరాస్తే సహించేది లేదు
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:15 PM
గిరిజనుల హక్కులను కాల రాస్తే సహించేది లేదని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ జాటోత్ హుస్సేన్ హెచ్చరించారు.
- జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్
కొల్లాపూర్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల హక్కులను కాల రాస్తే సహించేది లేదని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ జాటోత్ హుస్సేన్ హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ముక్కిడి గుండంలో బుధవారం గిరిజన బంజారా ఆత్మ గౌరవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తరతరా లుగా అడవుల్లో జీవిస్తూ పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరి జనులకు తగిన న్యాయం జరగాలని స్పష్టం చేశారు. సర్వేల సమయంలో సాంకేతిక కారణాలు, ఆధార్ లేదా ఇతర ఆధారాలు లేవనే సాకుతో ఏ ఒక్క గిరిజన రైతుకు అన్యాయం జరగకూడదని హెచ్చరించారు. 60-70 ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్నట్లు గ్రామస్థుల ధ్రువీకరణ పత్రం ఆధారం గానే డాక్యుమెంటేషన్ పూర్తి చేసి పట్టాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అధికారుల అనుమతుల పేరుతో రైతులను వేధించడం తగద ని స్పష్టం చేశారు. అటవీ సంరక్షణ పేరుతో గిరిజనుల సంప్రదాయ ఆచారాలు, దేవాలయాలు, గుడులు, వారి జీవనోపాధిపై ఆంక్షలు విధించకూ డదని అటవీశాఖ అధికారులకు సూచించారు. స్థానిక నాయకులు కొల్లా పూర్ ప్రాంతంలోని గిరిజనుల సమస్యలను పాలమూరు - రంగారెడ్డి ప్రాజె క్టు ముంపు బాధితుల ఇబ్బందులను జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకు వచ్చారు. పోడు భూములు, ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజే శారు. కార్యక్రమంలో ఆర్డీవో భన్సీలాల్, తహసీల్దార్ మాధవి, ఎంపీడీవో వెం కట్రావ్, ఫారెస్టు రేంజర్ వాణికుమారి, ముక్కిడిగుండం సర్పంచ్ లాలీబాయి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు, నాగర్‌కర్నూల్ ఇన్‌చార్జి దిలీప్ చారి, బీజేపీ గిరిజన సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.