Share News

పాలమూరును అద్భుతంగా తీర్చిదిద్దుతా

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:18 PM

మహబూబ్‌నగర్‌ పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధితో అద్భుత నగరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

 పాలమూరును అద్భుతంగా తీర్చిదిద్దుతా
మహిళల ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధితో అద్భుత నగరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో ముడా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, మాట్లాడారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుధ్యం, పచ్చదనం, మహిళా సాధికారతతో కూడిన అభివృద్ధి అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నగర అభివృద్ధిలో భాగంగానే చిల్డ్రన్స్‌ పార్కులు ఏర్పాటు, ఆలయాల వద్ద షెడ్‌ నిర్మాణాలు, తెలంగాణ చౌరస్తాలోని బాలికల వసతిగృహంలో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హౌజింగ్‌ బోర్డులో మహిళల కోసం ప్రత్యేక ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేయడంతో పాటు పునఃనిర్మాణం చేపట్టిన పార్కును అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు వినోద్‌కుమార్‌, సిరాజ్‌ఖాద్రీ, ఖాజాపాష, వెంకటేశ్‌, అంజద్‌, మోతీలాల్‌, శివశంకర్‌, రామాంజనేయులు, ఫయాజ్‌, ప్రవీణ్‌కుమార్‌, రోజారెడ్డి, యాదమ్మ, రాణి పాల్గొన్నారు.

జాతీయ స్థాయిలో రాణించాలి

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ : జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి రాణించాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే జన్మదినం పురస్కరించుకొని వాలీబాల్‌ క్రీడా పోటీలు నిర్వహించగా, ముందుగా ఎమ్మెల్యే కేక్‌ కట్‌ చేసి పోటీలు ప్రారంభించి, మాట్లాడారు. త్వరలో రూ.16 కోట్లతో జిల్లా క్రీడా మైదానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 04 , 2026 | 11:18 PM