మోదీని ఒప్పించి బీసీ రిజర్వేషన్ సాధిస్తాం
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:09 PM
: దేశప్రధాని నరేంద్రమోదీని ఒప్పించి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృ ష్ణయ్య చెప్పారు. శనివారం జిల్లా కేంద్రం లో బీసీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మునిసిపల్ కౌ న్సిల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన బీసీ సర్పంచు, కౌన్సిలర్, కార్పొరేటర్లను సన్మానించారు.
పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు ప్రధాని సానుకూలం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : దేశప్రధాని నరేంద్రమోదీని ఒప్పించి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృ ష్ణయ్య చెప్పారు. శనివారం జిల్లా కేంద్రం లో బీసీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మునిసిపల్ కౌ న్సిల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన బీసీ సర్పంచు, కౌన్సిలర్, కార్పొరేటర్లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిఽథిగా హా జరై మాట్లాడారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి దా న్ని అమలు చేయించే విధం గా కృషి చేస్తానన్నారు. బీసీ బి ల్లుకు ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్స్ అమలైతేనే న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రతీ ఒక్కరు తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. మాజీ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ బీసీలు అంతా ఒక్క తాటిపై పోరాడి బీసీ బిల్లుకు చట్టబద్ధత తీసుకురాల్సిన అ వసరం ఉందన్నారు. అనంతరం మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, జేపీఎన్‌సీఈ చైర్మన్ రవికుమార్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న తదితరులు మాట్లాడారు. ఆర్ కృష్ణయ్య, వి.శ్రీనివా్‌సగౌడ్, డీ సీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్, బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృ ష్ణుడు సర్పంచు, కౌన్సిలర్, కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. బీసీ టీచర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీటీఏ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి ధనుంజయ, మ ల్లేష్ పాల్గొన్నారు.