దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:27 PM
దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ కోశాధికారి కేఎస్ రవికుమార్ పేర్కొన్నారు.
- ఉత్సవ కమిటీ కోశాధికారి కేఎస్ రవికుమార్
మహబూబ్‌నగర్ న్యూటౌన్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ కోశాధికారి కేఎస్ రవికుమార్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసి, మాట్లాడారు. ఈ ఏడాది ధ్వజధారిగా గోరంట్ల మాల్యాద్రిరెడ్డి వ్యహరిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిలుగా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. వీరితో పాటు పార్టీలకతీతంగా అందరిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ధ్వజారోహణ నారాయణరావు భరద్వాజ్చే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ రకాల వేషధారణలతో గడియారం చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా, బస్టాండు మీదుగా బాలుర కళశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ మురళిధర్‌రావు, సభ్యులు సత్తూర్ చంద్రకుమార్‌గౌడ్, మాల్యాద్రిరెడ్డి, అంజయ్య, భాస్కర్‌గౌడ్, లక్ష్మణ్, రమేష్, నరసింహరెడ్డి, ముత్యాల కోమల్, పండగ సాయితేజ పాల్గొన్నారు.