Share News

స్వయం ఉపాధితో ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:22 PM

విద్యావంతులైన యువత ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా స్వయంఉపాధితో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ రామలింగేశ్వరగౌడ్‌ అన్నారు.

స్వయం ఉపాధితో ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి
మాట్లాడుతున్న జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ రామలింగేశ్వర గౌడ్‌

  • జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ రామలింగేశ్వర గౌడ్‌

  • మహిళా డిగ్రీ కళాశాలలో ఒక్కరోజు వర్క్‌షాప్‌

గద్వాల టౌన్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): విద్యావంతులైన యువత ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా స్వయంఉపాధితో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ రామలింగేశ్వరగౌడ్‌ అన్నారు. ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్వయం ఉపాధి అవకాశాలపై ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. రిసోర్స్‌పర్సన్‌గా హాజరైన రామలింగేశ్వరగౌడ్‌, ఉపాధి అవకాశాల ప్రాముఖ్యత, ప్రస్తుత కాలంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎంఈజీపి, టీ-ప్రైడ్‌, టీ-ఐడియా, టీఎంవీకే, డీఈఈటీతో పాటు ఉద్దెం రిజిస్ర్టేషన్‌ వంటి అంశాల గురించి వివరించారు. బ్యాంకుల ద్వారా అందే రుణాలు, సబ్సిడీలు పొందేవిధానం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మీనాక్షి, జిల్లా ఎంటర్‌ప్రెన్యూన్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ మేనేజర్‌ దయాకర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ శ్యామల, కళాశాల ప్లేస్‌మెంట్‌ కన్వీనర్‌ సమత, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ జగన్‌మోహన్‌, అధ్యాపకులు దేవుజా, లక్ష్మీనారాయణ, బ్రహ్మేశ్వర్‌ ఉన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:22 PM