కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉండాలి
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:37 PM
ఎన్నికలు ఈ రోజు వరకు మాత్రమే ఉంటాయని, రేపటి నుంచి అందరం అన్నదమ్ము ల్లా, ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉండాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి
మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ఈ రోజు వరకు మాత్రమే ఉంటాయని, రేపటి నుంచి అందరం అన్నదమ్ము ల్లా, ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉండాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మ హబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో ఓటు వేశారు. సతీమణి ప్రసన్నతో కలిసి నగరంలోని పద్మావతి కా లనీలో గల ప్రతిభ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 96లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్‌గా అభివృద్ధి చెందిన త రువాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇ వని చెప్పారు. ఏ నాయకుడి వలన అభివృద్ధి ప నులు జరుగుతాయో గమనించి ఓటు వేయాలని సూచించారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రవీణ పాల్గొన్నారు.