Share News

ప్రజాసేవలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:44 PM

ప్రజాసేవలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని, సమాజాభి వృద్ధికి తమ వంతు కృషి చేయాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు.

ప్రజాసేవలో భాగస్వాములు కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ డీకే అరుణ

- మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

- నారాయణపేటలో ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’

- హాజరైన కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక

నారాయణపేట, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసేవలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని, సమాజాభి వృద్ధికి తమ వంతు కృషి చేయాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీగార్డెన్స్‌లో శుక్రవారం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు, ఆర్పీలకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆ మెతో పాటు, కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఆరోగ్యం, పోషకాహారం, టీకాలు, పారిశుధ్యంపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వికసిత్‌ భారత్‌ - 2047 లక్ష్య సాధనలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఆశ వర్కర్లు, అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాలు, ఆర్‌పీలు, మహిళా సంఘాల ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ము నిసిపల్‌ చైర్‌పర్సన్‌ కొండా శ్వేతా సత్య యాదవ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్‌ పాండ్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్‌, డీడబ్ల్యూవో రాజేందర్‌ గౌడ్‌, డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో సిద్ధప్ప, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షు రాలు విమల, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘురామయ్య గౌడ్‌, బీజేపీ రాష్ట్ర, జిల్లా ముఖ్య బాధ్యులు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:44 PM