మానసిక ఒత్తిడిని జయించాలి
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:19 PM
మానసిక ఒత్తిడిని జయిస్తేనే గుండెకు రక్ష అని మహబూబ్‌నగర్ మునిపల్ కార్పొరేషన్ మేయర్ మమత పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) సెప్టెంబ రు29 (ఆంధ్రజ్యోతి) : మానసిక ఒత్తిడిని జయిస్తేనే గుండెకు రక్ష అని మహబూబ్‌నగర్ మునిపల్ కార్పొరేషన్ మేయర్ మమత పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రణయ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రా రంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని, ఇందుకు ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడులు, జీవనశైలిలో మార్పులేనని అన్నారు. అందువలన ప్రతి ఒక్కరు శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలని, ప్రతి రోజు నడవాలని అన్నారు. ప్రజల్లో గుండె జబ్బులపై అవగాహన కల్పించేందుకు ఈ 5 కే రన్ కా ర్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమ న్నారు. ఈ 5 కే రన్‌లో గెలుపొందిన వారికి రూ.10వేల నగదు బహుమతిని అందజేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఐఎంఏ డాక్టర్లు రాంమో హన్, శ్యామ్యూల్, మధుసూదన్‌రెడ్డి, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.