లూయీస్ బ్రెయిలీ స్ఫూర్తితో ముందడుగు వేయాలి
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:22 PM
అక్ష రమే ఆయుధంగా మలిచి అంధ విద్యార్థులకు మార్గం చూపిన లూయీస్ బ్రెయిలీ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
కలెక్టర్ బీఎం సంతోష్
అంధుల ఆశ్రమ పాఠశాలలో బ్రెయిలీ జయంతి వేడుకలు
గద్వాల టౌన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): అక్ష రమే ఆయుధంగా మలిచి అంధ విద్యార్థులకు మార్గం చూపిన లూయీస్ బ్రెయిలీ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. జిల్లా మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రాఘవేంద్రకాల నీ అంధుల ఆశ్రమ పాఠశాలలో లూయీస్ బ్రె యిలీ 217వ జయంతిని ఘనంగా నిర్వహించా రు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ బ్రెయిలీ వి గ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్య ప్రా ముఖ్యతను గుర్తించి రెండు వందల ఏళ్ల క్రితమే అంధుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించిన బ్రెయి లీ ప్రపంచంలోనే చిరస్మరణీయుడిగా మిగిలార ని అన్నారు. గద్వాల ఇద్దరు విద్యార్థులతో 1993లో ప్రారంభమైన పాఠశాలలో వంద మం దికి పైగా విద్యార్థులు ఉండటం సంతోషకరమ న్నారు. ఈపాఠశాలలో చదివిన 50మంది విద్యా ర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గర్వకా రణమన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించిందని, వాటి ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూడీఐడీ కార్డుల మంజూరులో ఎదురవుతున్న సమస్యల ను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గద్వాల మునిసిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా ఉద్యోగం పొందిన పూర్వ వి ద్యార్థి శివకుమార్‌ను సన్మానించారు. విద్యార్థు లతో కలిసి కేక్ కట్‌చేసిన కలెక్టర్ పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సునంద, డీఈఓ విజయలక్ష్మి, పాఠశాల కార్య దర్శి రంగన్న ఉన్నారు.