ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - Nov 29 , 2026 | 11:07 PM
ముదిరాజుల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి
మూసాపేట, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ముదిరాజుల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ముదిరాజు కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించి, మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హమీని అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ముదిరాజులు రాష్ట్రంలో పెద్ద సామాజిక వర్గాల్లో ఒకరని, వారి జనాభా ప్రాతిపదికన రాజకీయంగా, సామాజికంగా తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను కొనసాగిస్తూనే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట శ్రీహరి, మాజీ ఎంపీపీలు నాగార్జున్‌రెడ్డి, బగ్గి కృష్ణయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, నాయకులు హేమవర్ధన్‌రెడ్డి, రంజిత్, మహవీర్, కృష్ణయ్య ఉన్నారు.