మీ నిర్లక్ష్యంతోనే నీటి కష్టాలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:42 PM
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పు లను, నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, తనపైనా అసత్య ప్రచారాలు చేస్తున్నారని రా ష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై జూపల్లి
కొల్లాపూర్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పు లను, నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, తనపైనా అసత్య ప్రచారాలు చేస్తున్నారని రా ష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. మోటార్లు కాలిపోతే ఐదేళ్లు పట్టిం చుకోని మీరు కేఎల్‌ఐ గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు.
2023 ఎన్నికలకు ముందు కేవలం ఓట్ల కోసం హడావుడిగా నార్లాపూర్ వద్ద ఒక మో టార్ ఆన్ చేసి నీళ్లు వదిలారని, కానీ అక్కడి నుంచి నీరు ముందుకు పారేలా ప్యాకేజీ పను లను, కాల్వల తవ్వకాలను పూర్తి చేయలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసినా పాలమూరు ప్రాంత ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిల దీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్ష కోట్లు ఖర్చు పెట్టి మల్లన్న సాగర్ (50 టీఎంసీ) రంగ నాయకసాగర్ లాంటి పెద్ద రిజర్వాయ ర్లు కట్టారు. కానీ పాలమూరు, జూరాల, కల్వ కుర్తి ప్రాంతాలలోని 10 లక్షల ఎకరాలకు తగి న రిజర్వాయర్లు నిర్మించకుండా సవతి తల్లి ప్రేమ చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం నా రాజకీ య జీవితం అన్నారు. తన వ్యక్తిత్వంపై ఆరోప ణలు చేసే అర్హత నిరంజన్‌రెడ్డికి లేదని జూ పల్లి స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఎమ్మె ల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసిన చరి త్ర నాదన్నారు. బహిరంగ చర్చకు మూడు కుర్చీలు వేసి పిలిచినా పారిపోయిన వారు ఇప్పుడు సవాళ్లు విసరడం విడ్డూరంగా ఉందన్నారు.