శిథిలావస్థలో వాటర్‌ట్యాంక్
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:29 PM
మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ వెన్నచెడ్ గ్రామంలో 90వేల లీటర్ల సామర్థ్యం గల వా టర్ ట్యాంక్ శిథిలావస ్థకు చేరింది.
గండీడ్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ వెన్నచెడ్ గ్రామంలో 90వేల లీటర్ల సామర్థ్యం గల వా టర్ ట్యాంక్ శిథిలావస ్థకు చేరింది. దాదాపు 40 ఏళ్ల క్రితం ఈ ట్యాంకు నిర్మించారని గ్రామస్థులు చెబుతున్నారు. ప్ర స్తుతం ట్యాంక్ కింది భాగంలో పెచ్చులు ఊ డి పడటంతో పాటు ఫిల్లర్లకు పిల్లర్లకు ఇనుప చువ్వలు పూర్తిగా తేలిపోయి ఎప్పుడు కూలి పడుతుంతో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని గ్రామ స్థులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రమాదం జరగక ముందే త్వరగా ట్యాంకును కూల్చివేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
త్వరలో కూల్చేందు చర్యలు
వెన్నచెడ్ గ్రామంలో వాటర్ ట్యాంక్ శిథిలా వస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్న విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఇటీవలే క్వాలిటీ చెక్ చేశాం. శిథిలావస్థకు చేరింది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కూల్చేందుకు చర్యలు తీసుకుంటాం.
- రామకృష్ణ, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్