నీటిని పొదుపుగా వాడుకోవాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:46 PM
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున, ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు.
అదనపు కలెక్టర్ మధుమోహన్
గద్వాల, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున, ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మం త్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో కలిసి రైతుసేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాలోని రైతువేదికల్లో పాల్గొన్న అధికారులు, రైతులతో వీసీ ద్వారా మాట్లాడారు. రబీ సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లో రైతులు వరిసాగు చేయవద్దన్నారు. బిందుసేద్యంతో ఆయిల్‌పామ్ తోటలు, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని సూచించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడుగుంతలు, నీటికుంటలు, బోర్‌వెల్స్ రీచార్జ్ తదితర పనులు చేపట్టి జలవనరులను కాపాడుకోవాలన్నారు. గద్వాల మండలం చెనుగోనుపల్లి గ్రామ రైతువేదిక వద్ద అదనపు కలెక్టర్ అధికారులు, రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ను తిలకించారు. వీసీ అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను అనుసరించి రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు. ఎల్‌ని నో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలుచేయడం జరు గుతుందన్నారు. ఈక్రమంలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు పెద్దఎత్తున అవగాహన క ల్పించేందుకు విస్తృతంగా అన్నిమాధ్యమాల ద్వారా, కళాజాత బృందాలతో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. రైతులు నష్టపోకుండా ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తారని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచు పద్మమ్మ, నీటిపారుదల శాఖ ఇన్‌చార్జి ఎస్‌ఈ శ్రీనివాసులు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజ్‌కుమార్, రాజశేఖర్, వ్యవసాయ శాఖ ఏవోలు ప్రతాప్‌కుమార్, సాజిద్, ఏఈవో ప్రవళిక, పంచాయతీ కార్యదర్శి రామనర్సింహులు, రైతులు పాల్గొన్నారు.