Share News

జూరాల నీటిని విడుదల చేయాలి

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:27 PM

మక్తల్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జూ రాల నీటిని విడుదల చేసి రైతుల పంటలు కా పాడాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి అన్నారు.

జూరాల నీటిని విడుదల చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

మక్తల్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జూ రాల నీటిని విడుదల చేసి రైతుల పంటలు కా పాడాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆ యన ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు కింద రైతుల పంటలు ప్రస్తుతం పొట్ట దశకు చేరుకున్నాయ న్నారు. రైతులకు సాగునీరు అందించకపోతే వే ల రూపాయల నష్టం జరుగుతుందన్నారు. రై తు ప్రభుత్వమని చెప్పుకునే ప్రభుత్వం రైతుల కు నీటిని అందించకపోవడం దారుణమన్నారు. నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. సమావేశంలో బీఆర్‌ ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌గుప్తా, రుద్రసముద్రం రామలింగం, గాల్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, మల్లేశ్వర్‌ రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:28 PM