Share News

నీటి సంరక్షణ ప్రతీ పౌరుడి బాధ్యత

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:42 PM

వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని మునిసిపల్‌ కమిషనర్‌ అశోక్‌రెడ్డి అన్నారు.

నీటి సంరక్షణ ప్రతీ పౌరుడి బాధ్యత

  • మునిసిపల్‌ కమిషనర్‌ అశోక్‌ రెడ్డి

వడ్డేపల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని మునిసిపల్‌ కమిషనర్‌ అశోక్‌రెడ్డి అన్నారు. వడ్డేపల్లి మునిసిపాలి టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పీఎస్‌ పాఠశాలలో రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌( వర్షపు నీటిసంరక్షణ)పై అవగాహన కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా క మిషనర్‌ మాట్లాడుతూ వర్షపు నీటిని భూ మిలోకి ఇంకేటా చేయడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు భవిష్యత్‌లో నీటికొరతను అధిగమించవచ్చన్నారు. ప్రతీ ఇం టి, ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థలు, వాణి జ్య భవనాల్లో తప్పనిసరిగా రెయిన్‌ వాటర్‌ హా ర్వెస్టింగ్‌ నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేసమయంలో విద్యార్థులు నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించుకుని త మ కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజల కు కూడా ఈసందేశాన్ని చేరవేయాలని కోరారు. వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతీ వ ర్షపు నీటిబొట్టును సంరక్షించడం ద్వారా పర్యావ రణ పరిరక్షణతో పాటు భావితరాలకు సురక్షిత మైన నీటి వనరులను అందించవచ్చన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు వర్షపు నీటిని వృథా కాకుండా సంరక్షించడం, రెయిన్‌ వాటర్‌ హార్వె స్టింగ్‌ నిర్మాణాలను ప్రోత్సహించడం, నీటి విని యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి అంశాలపై ఉపాధ్యాయులు, పాఠశాల సి బ్బంది, విద్యార్థులతో కలిసి మునిసిపల్‌ సిబ్బం ది ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ముని సిపల్‌ అధికారులు, సిబ్బంది, పాఠశాల ప్రధానో పాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 11:42 PM