Share News

నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:24 PM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందు న రైతులు రబీ సీజన్‌లో ఆరుతడి పంటలపై సాగు చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు.

నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడాలి
ధరూర్‌ రైతువేదికలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

  • జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

ధరూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందు న రైతులు రబీ సీజన్‌లో ఆరుతడి పంటలపై సాగు చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. ఇళ్లలోనూ నీటిని, విద్యుత్‌ను వృథా చే యకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించా రు. ఎన్‌నినో నేపథ్యంలో ఆరుతడి పంటల సా గు ఆవశ్యకత, వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై మంగళవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ సురేంద్ర మో హన్‌, డైరెక్టర్‌ గోపి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో మాట్లా డారు. ధరూర్‌ రైతువేదికలో వ్యవసాయ, ఉద్యా నవన శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. వీసీ అనంతరం మాట్లాడారు.రానున్నకాలంలో అధిక ఉష్ణోగ్రత, వర్షపాతంలోటు, భూగర్భజలాల తగ్గుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో శా స్త్రవేత్తలు, అధికారుల సలహాలు పాటించాలన్నా రు. తమ పొలాల్లో బోరు, బావుల నీటి లభ్యత ఆధారంగా పప్పు దినుసులు, తృణధాన్యాలు, కూ రగాయలు వంటి ఆరుతడి పంటలపై దృష్టి సా రించాలన్నారు. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది జూలై వరకు ఉంటున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటిని తాగునీ టి అవసరాలకు మాత్రమే వినియోగించడం జరుగుతుందన్నారు. రైతులు, రైతు కుటుం బాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌, ప్రై మరీ అగ్రికల్చర్‌ కోపరేటివ్‌ సొసైటీల్లో చేరాలని సూచించారు.

Updated Date - Oct 27 , 2026 | 11:24 PM