Share News

అడవిలో ఆయుధాలతో సంచారం

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:16 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా, అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం ప్రాంతంలో ఆయుధాలతో సంచరిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అచ్చంపేట ఎఫ్‌డీవో చంద్రశేఖర్‌ తెలిపారు.

అడవిలో ఆయుధాలతో సంచారం
వివరాలను వెల్లడిస్తున్న ఎఫ్‌డీవో చంద్రశేఖర్‌

- నలుగురిని రిమాండ్‌కు తరలింపు

అచ్చంపేట, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా, అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం ప్రాంతంలో ఆయుధాలతో సంచరిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అచ్చంపేట ఎఫ్‌డీవో చంద్రశేఖర్‌ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అటవీ ప్రాంతం లోని ప్రతాపరుద్రుడి కోట సమీపంలో నలుగురు వ్యక్తులు ఆయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ట్రాప్‌ కెమెరాల ఫుటేజీతో గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల్లో మూడావత్‌ బాలు, దారంగుల నర సింహ, సరియా, పాస్టర్‌ జాన్‌పాల్‌ ఉన్నట్లు వెల్లడించారు. సమావేశంలో అటవీశాఖ డివిజనల్‌ అధికారులు రామ్మోహన్‌, రామ్మూర్తి, ఫారెస్టు రేంజ్‌ అధికారి సుబూర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:16 PM