ప్రభుత్వ ఆస్పత్రిలో టోకెన్ల కోసం నిరీక్షణ
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:24 PM
మండలంలోని అప్పక్‌పల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మంగళవారం టోకెన్ల కోసం గర్భిణులు నిరీక్షించాల్సి వచ్చింది.
నారాయణపేట రూరల్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అప్పక్‌పల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మంగళవారం టోకెన్ల కోసం గర్భిణులు నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో స్కానింగ్‌కు టోకెన్లు ఇస్తామన్న అధికారులు, సిబ్బంది సమయానికి రాకపోవడంతో దాదాపు గంట పాటు నిరీక్షించినట్లు వాపోయారు. సిబ్బంది కొంత సమయానికి వచ్చినా టోకెన్లు ఎవరు ఇస్తారు.. ఎవరిని అడగాలని కోరినా కనీసం చెప్పలేదని వారు వాపోయారు. దీంతో గర్భిణులు అవస్థలు ఎదుర్కొనాల్సి వచ్చింది. సంబంధిత అధికారులు స్పందించాలని వారు కోరారు.