Share News

అర్హులందరికీ ఓటు హక్కు

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:10 AM

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని నారాయణపేట కలెక్టర్‌ ప్రియాంక బూత్‌ లెవల్‌ అధికారులను ఆదేశించారు.

అర్హులందరికీ ఓటు హక్కు
సర్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రియాంక, మునిసిపల్‌ కమిషనర్‌ శంకర్‌

- నారాయణపేట కలెక్టర్‌ ప్రియాంక

- బీఎల్‌వో సర్వే క్షేత్రస్థాయిలో పరిశీలన

నారాయణపేట, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని నారాయణపేట కలెక్టర్‌ ప్రియాంక బూత్‌ లెవల్‌ అధికారులను ఆదేశించారు. నారాయణపేట పట్టణంలోని 142, 143 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న బీఎల్‌వోల సర్వేను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి వివరాలను ధ్రువీకరించాలని, అవసరమైన పత్రాలను సేకరించాలని సూచించారు. వివరాల పరిశీలనలో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఆమె వెంట మునిసిపల్‌ కమిషనర్‌ శంకర్‌, వార్డు కౌన్సిలర్‌ అరుణ ఉన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:10 AM