Share News

ఓటర్లకు అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:41 PM

ఎస్‌ఐఆర్‌ ఎన్యుమరేష న్‌ పారాలను పూర్తి చేయడంపై ఓటర్ల కు అవగాహన కల్పించాలని నారాయ ణపేట కలెక్టర్‌ ప్రియాంక బూత్‌ స్థా యి ఏజెంట్లకు సూచించారు.

ఓటర్లకు అవగాహన కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రియాంక

- బూత్‌స్థాయి ఏజెంట్లతో నారాయణపేట కలెక్టర్‌ ప్రియాంక

నారాయణపేట, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఐఆర్‌ ఎన్యుమరేష న్‌ పారాలను పూర్తి చేయడంపై ఓటర్ల కు అవగాహన కల్పించాలని నారాయ ణపేట కలెక్టర్‌ ప్రియాంక బూత్‌ స్థా యి ఏజెంట్లకు సూచించారు. ఎన్యుమ రేషన్‌ ఫారాల పంపిణీ, స్వీకరణపై గుర్తింపు పొందిర రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం నిర్వ హించిన సమావేశంలో ఆమె మాట్లాడా రు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగనున్నదని తెలిపారు. అందులో భాగంగా బూత్‌స్థాయి అధికా రులు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను ధ్రువీకరించనున్నట్లు చెప్పా రు. ఈనెల 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారని, వచ్చేనెల 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారని తెలిపారు. ఆ తరువాత సెప్టెంబర్‌ 28 వరకు అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీను, డీఆర్‌వో రాజేశ్వరి, సీ సెక్షన్‌ అధికారి జయసుధ, బీఆర్‌ఎస్‌ నాయకులు అబ్దు ల్‌ సలీమ్‌ అడ్వకేట్‌, కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ సలీమ్‌, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు కమ్రొద్దీన్‌, బీజేపీ జిల్లా నాయకులు కెంచీ శ్రీను, టీడీపీ నాయకులు రాఘవ చౌదరి, గొల్ల గోపాల్‌ పాల్గొన్నారు.

రేపు ఫారాల పంపిణీ పూర్తి

జిల్లాలో ఎన్యుమరేషన్‌ ఫారాల పం పిణీ ఈనెల 7వ తేదీలోగా పూర్తి అవు తుందని కలెక్టర్‌ ప్రియాంక తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శ న్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ లోని వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి అన్ని గుర్తింపు పొందిన రాజకీ య పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణ నలోకి తీసుకుని పోలింగ్‌ కేంద్రాల ము సాయిదాను సిద్ధం చేస్తామని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శ న్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ను ఈనెల 24 లోగా వంద శాతం పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ శ్రీను, ఆర్‌డీవో రమేశ్‌, సూపరింటెండెంట్‌ జయసుధ వివిధ శిఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 11:41 PM