Share News

యువతకు వివేకానందుడు స్ఫూర్తి

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:27 PM

స్వామి వివేకానందుడిని నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు.

యువతకు వివేకానందుడు స్ఫూర్తి
స్వామి వివేకానందుడి విగ్రహం వద్ద నివాళి అర్పించి, మాట్లాడుతున్న చిన్నారెడ్డి

- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

వనపర్తి రాజీవ్‌ చౌరస్తా, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : స్వామి వివేకానందుడిని నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని వనపర్తి పట్టణంలో సోమవారం నిర్వహిం చిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివేకానంద స్వామి విగ్రహం, చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ నేటి కాలంలో ఇంటర్‌నెట్‌, ఓటీటీ, సినిమాల ప్రభావంతో యువత గాడి తప్పుతోందన్నారు. మాదకద్రవ్యాల మత్తులో చిత్తవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే స్వా మీ వివేకానందను ప్రేరణగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో చిన్నారెడ్డితో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, ఏఐసీసీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, నాయకులు బాలా, శంకర్‌గౌడ్‌, రాగి, అక్షయ్‌, ఇర్ఫాన్‌, బ్రహ్మం, వెంకటేశ్‌సాగర్‌, కోళ్ల వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 11:27 PM