Share News

సైకిల్‌పై జ్యోతిర్లింగాల దర్శనం

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:30 PM

భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా, కోయిలకొండ మండలం నక్కవానికుంటతం డాకు యువకుడు చెంది న విక్కచావన్‌ సాహస యాత్ర చేపట్టారు.

సైకిల్‌పై జ్యోతిర్లింగాల దర్శనం
కేదార్‌నాథ్‌ ఆలయ ఆవరణలో సైకిల్‌తో విక్కచావన్‌

- నక్కవానికుంట తండా యువకుడి సహస యాత్ర

కోయిలకొండ, అక్టోబ రు 2 (ఆంధ్రజ్యోతి) : భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా, కోయిలకొండ మండలం నక్కవానికుంటతం డాకు యువకుడు చెంది న విక్కచావన్‌ సాహస యాత్ర చేపట్టారు. గత ఫిబ్రవరి 10న సైకిల్‌పై జ్యోతిర్లింగాల సందర్శన యాత్రను ప్రారంభించా రు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, పశ్చిమబెంగాల్‌, అసోం, మేఘాలయ, జార్ఖండ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్త రాఖండ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు 9 వేల కిలోమీ టర్లు యాత్ర కొనసాగించారు. మరో ఐదు నెలల పాటు తన సైకిల్‌ యా త్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు.

Updated Date - Oct 02 , 2026 | 11:30 PM