Share News

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధి

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:08 PM

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సా ధ్యమవుతుందని కలెక్టర్‌ సీ హెచ్‌.ప్రియాంక అన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధి
జాజాపూర్‌ గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక

- కలెక్టర్‌ ప్రియాంక

నారాయణపేట రూరల్‌/ దామరగిద్ద/నర్వ/కొత్త పల్లి/ఊట్కూర్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సా ధ్యమవుతుందని కలెక్టర్‌ సీ హెచ్‌.ప్రియాంక అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని నారాయణపేట మండలం, జాజాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ‘వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళిక’ ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్‌ సంగీత అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సభకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పాఠశాల ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి సర్పంచ్‌ తో కలిసి పూలమాల వేసి నివాళి అర్పిం చారు. అనంతరం గ్రామ సామాజిక, గ్రామ వనరుల చిత్రపటాలను పరిశీలించారు. ఈ సం దర్భంగా గ్రామంలోని వనరులను వీబీజీ రామ్‌ జీ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ ఇన్‌చార్జి రాజు కలెక్టర్‌ కు వివరించారు. ఆ తర్వాత నిర్వహించిన గ్రా మసభలో కలెక్టర్‌ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న వనరులను గుర్తించి భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, విద్యాఫలితాలు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ తదితర అంశాల్లో జాజాపూర్‌ ముందుండటాన్ని కలెక్టర్‌ ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సహ కార సంఘం అధ్యక్షుడు కాంత్‌కుమార్‌, డీఆర్డీవో వెంకట్రాములు, డీడబ్ల్యూవో రాజేందర్‌గౌడ్‌, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ జిల్లా నోడల్‌ అధికారి యాదయ్య, ఎంపీవో బాలాజీ, ఉపసర్పంచ్‌ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

అదేవిధంగా, దామరగిద్ద మండలం బాపన్‌ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవా రం నిర్వహించిన గ్రామసభలో వీబీజీ రామ్‌జీ పనులతో పాటు, బాల్య వివాహాల నిరోధంపై స ర్పంచు గవినోళ్ల శ్రీనివాస్‌ గ్రామస్థులతో చర్చిం చారు. అనంతరం బాల్య వివాహాలను అరికడ తామంటూ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్ర తిజ్ఞ చేశారు. ఉప సర్పంచు అంజప్ప, వార్డు స భ్యులు ఉదయ్‌కుమార్‌, అంజప్ప, పంచాయతీ కార్యదర్శి బిందు తదితరులున్నారు.

నర్వలో నిర్వహించిన గ్రామసభలో బాల్య వి వాహాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిం చారు. వీబీజీ రామ్‌జీ పథకం కింద గ్రామంలో చేపట్టనున్న కొత్త పనులు, వాటి ద్వారా రైతు లకు కలిగే ప్రయోజనాలపై వివరించారు. సర్పం చు హన్మంత్‌రెడ్డి, ఉపసర్పంచు అజయ్‌, కార్యద ర్శి బుచ్చారెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మనెమ్మ, ఆశా వర్కర్లు, అంగనాడీ టీచర్లు, గ్రామస్థులు పా ల్గొన్నారు.

కొత్తపల్లి మండలం భూనీడులో నిర్వహించిన గ్రామసభలో ఎంపీడీవో కొండన్న బాల్య వివా హాల వల్ల కలిగే అనర్థాలను గ్రామస్థులకు వివ రించారు. వీబీజీ రామ్‌జీ పనులపై అవగాహన కల్పించారు. వివిధ శాఖల అధికారులు, పంచా యతీ కార్యదర్శి తిరుపతి, కాంగ్రెస్‌ పార్టీ నాయ కులు పాల్గొన్నారు.

ఊట్కూర్‌ మండలం పెద్దజట్రం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఈసీ మహిపాల్‌ గ్రా మ ప్రణాళికను సిద్ధం చేశారు. సర్పంచు వెంక టేశ్‌ పాల్గొన్నారు. గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి, గ్రామ ప్రణాళికలను సిద్ధం చేశారు.

Updated Date - Oct 02 , 2026 | 11:08 PM