Share News

గెలుపోటములు సహజం

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:28 PM

క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని అకాడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీ సర్‌ (ఏఎంవో) దుంకుడు శ్రీనివాస్‌ అన్నారు.

గెలుపోటములు సహజం
వాలీబాల్‌ పోటీలో విజేత నవాబ్‌పేట పాఠశాల బాలుర జట్టు

- పాలమూరు ఏఎంవో దుంకుడు శ్రీనివాస్‌

- ఉత్సాహంగా పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని అకాడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీ సర్‌ (ఏఎంవో) దుంకుడు శ్రీనివాస్‌ అన్నారు. స్కూల్‌ గేమ్స్‌ ఫేడరేషన్‌ ఆధ్వర్యంలో రెండో రోజు బుధవారం మహబూబ్‌నగర్‌లోని స్టేడియంలో పీంఎంశ్రీ జిల్లాస్థాయి వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ పోటీలను ఏఎంవో ము ఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నీలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. టోర్నీలో ప్రతిభ చాటి విజేతగా గెలిచిన జట్లు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తారని తెలిపారు. సాయంత్రం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ వేణుగోపాల్‌, టీజీపీడీపీఈటీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దూమర్ల నిరంజన్‌, పెట టీఎస్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ గౌడ్‌, ఎస్‌జీఎఫ్‌ మాజీ కార్యదర్శులు శారదాబాయి, కె.రమేశ్‌బాబు, పీడీలు కృష్ణ, వడెన్న, మోగులాల్‌, నాగరాజు, రామ్‌కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

వాలీబాల్‌ బాలుర విభాగంలో నవాబ్‌ పేట పాఠశాల జట్టు విజేతగా, గండీడ్‌ పాఠశాల జట్టు రన్నర్‌గా నిలువగా, బాలికల విభాగంలో విజేతగా బాలనగర్‌ గాజుల పేట, రన్నర్‌గా గార్లపాడ్‌ జట్టు నిలిచింది. అదే విధంగా అథ్లెటిక్స్‌ విభాగంలో పతకాలు సాధించారు.

Updated Date - Oct 28 , 2026 | 11:28 PM