Share News

పోరాటానికి ప్రతీక వడ్డె ఓబన్న : ఎమ్మెల్యే యెన్నం

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:32 PM

పోరాటానికి, త్యాగానికి, సామాజిక న్యాయానికి ప్రతీక వడ్డె ఓబన్న అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

పోరాటానికి ప్రతీక వడ్డె ఓబన్న : ఎమ్మెల్యే యెన్నం
వడ్డె ఓబన్నకు నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే యెన్నం, ఆనంద్‌గౌడ్‌

పాలమూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : పోరాటానికి, త్యాగానికి, సామాజిక న్యాయానికి ప్రతీక వడ్డె ఓబన్న అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాబోయే రోజుల్లో వడ్డె ఓబన్న జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, నాయకులు వినోద్‌ కుమార్‌, సిరాజ్‌ఖాద్రి, ప్రవీణ్‌కుమార్‌, రఘు, ప్రశాంత్‌, యాదయ్య, ఊషన్న పాల్గొన్నారు.

వడ్డె ఓబన్నను ఆదర్శంగా తీసుకోవాలి

నవాబ్‌పేట : వడ్డెరల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వడ్డె ఓబన్న సేవలు మరువలేనివని నవాబ్‌పేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హర లింగం, సర్పంచ్‌ గీతారాణి, కాంగ్రెస్‌ నాయకుడు దుశ్యంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఓబ న్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంత రం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. అధ్యక్షుడిగా నరేష్‌, వెంకటేష్‌, పోమాల్‌, ప్ర ధాన కార్యదర్శులుగా సంపంగి రాజు, నర్సింహు లు ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్‌ అజహర్‌ అలీ, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ నర్సింహచారి, సుధాకర్‌చారి, సత్యం, రాము పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 11:32 PM