Share News

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:24 PM

కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డీ వైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌ డిమాండ్‌ చే శారు.

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి
వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న డీవైఎఫ్‌ఐ నాయకులు

పాలమూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డీ వైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌ డిమాండ్‌ చే శారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూటౌ న్‌లో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంత రం మాట్లాడుతూ తక్షణమే నిరుద్యోగులకు మే లు చేయటానికి నోటిపికేషన్‌ వేయాలన్నారు. కేంద్రం ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు భర్తీ చే స్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10లక్షలకు పైగా ఖాళీ లు ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చే శారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 25వేల ఉ ద్యోగాలకు నోటిఫికేషన్‌ వేయాలన్నారు. నిరుద్యో గులకు నిరుద్యోగ భృతి రూ.5వేలు ఇవ్వాలన్నా రు. ఎలాంటి కోర్టు కేసులు లేకుండా వివాదా స్పదమైన జీవోలను తొలగించి, ఉద్యోగ నియా మకాలు చేపట్టాలన్నారు. 20వ తేదీన సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు నిరుద్యోగ యువ త అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో సాయి, నందు, సుదర్శన్‌, రవి, ప్రకాశ్‌, రమేశ్‌, శివ, ఈశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:24 PM