సీబీయూడీ యాప్‌ను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:06 PM
ఏ ప్రాంతంలోనైనా సంబంధిత శాఖలు తమ అవసరాల నిమిత్తం తవ్వకాలు జరిపే సమయంలో టెలికాం కేబుల్స్‌కు నష్టం జరుగకుండా ముందస్తు సమాచారం ఇవ్వడం సీబీయూడీ (కాల్ బిఫోర్ యు డిగ్) యాప్ ముఖ్యఉద్దేశం అని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఏ ప్రాంతంలోనైనా సంబంధిత శాఖలు తమ అవసరాల నిమిత్తం తవ్వకాలు జరిపే సమయంలో టెలికాం కేబుల్స్‌కు నష్టం జరుగకుండా ముందస్తు సమాచారం ఇవ్వడం సీబీయూడీ (కాల్ బిఫోర్ యు డిగ్) యాప్ ముఖ్యఉద్దేశం అని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ త్రైమాసికం టెలికాం కమిటీ సమావేశాన్ని నిర్వహించాలన్నారు. టెలికాం సేవలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుదల, ఆయా విభాగాల మధ్య సమన్వ యం ప్రధానమన్నారు. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, విద్యుత్, మునిసిపల్ తదితర సంబంధిత శాఖలు తప్పనిసరిగా ఈ యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. టెలీ కమ్యూనికేషన్ చట్టం ప్రకారం టెలికాం నెట్‌వర్క్‌కు నష్టం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యుల సమస్యలు వెంటనే పరిష్కరించి నివేదిక సమర్పించాలన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంత గ్రామాలలో ఇంట ర్నెట్ సదుపాయాన్ని కల్పించేందుకు ప్రతిపాదనలు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, కలెక్టరేట్ ఏవో భూపాల్‌రెడ్డి, బీఎస్‌ఎన్‌ఎల్ ఎస్‌డీఈ లక్ష్మీకాంత్, టీ-ఫైబర్ జోనల్ మేనేజర్ ఈశ్వర్, జిల్లా మేనేజర్ వేణు తదితరులు ఉన్నారు.