ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేసి.. అభివృద్ధి చేయండి
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:37 PM
కోయిలకొండ ప్రభుత్వ ఆసుపత్రిని అప్‌గ్రేచేసి సిబ్బందితో మందులు అందుబాటులో ఉంచాలని మండల సభలో సర్పంచులు పేర్కొన్నారు.
- సర్వసభ్య సమావేశంలో సర్పంచుల వినతి
కోయిలకొండ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : కోయిలకొండ ప్రభుత్వ ఆసుపత్రిని అప్‌గ్రేచేసి సిబ్బందితో మందులు అందుబాటులో ఉంచాలని మండల సభలో సర్పంచులు పేర్కొన్నారు. బుశారం మండల కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి అఽధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజారఘుపతిరెడ్డి మాట్లాడుతూ కోయిలకొండ ఆసుపత్రిని బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు స్పోర్ట్స్ మెటీరియల్ అందించాలని కోరారు. గ్రామ సమస్యలపై కలెక్టర్‌కు నివేదిక అందించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకొంటానని ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం గ్రామ సమస్యలు దృష్టిలో ఉంచుకొని ప్రతీ 45 రోజులకు అధికారులతో మండల సభ నిర్వహించడంపై సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. తహసీల్దార్ రాజాగణేష్, ఎంపీడీవో ధనుంజనేయులుగౌడ్, ఎంఈవో మీనాజ్‌దోద్దిన్, ఏవో యామారెడ్డి పాల్గొన్నారు.
భోజనం పెట్టించండి సార్..
మండల కార్యాలయంలో ఉదయం మండల ప్రత్యేక సమీక్ష సమావేశానికి సర్పంచులతో పాటు అన్నిశాఖల అధికారులు హాజరయ్యారు. కాగా ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరం సమీక్ష సమావేశం కొనసాగింది. దీంతో సమావేశానికి వచ్చిన సర్పంచులు భోజనం పెట్టి సమావేశం నిర్వహించండి అంటూ చమత్కరించినా ఎవ్వరు భోజనం చేయకుండానే సభ కొనసాగింది.