వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇవ్వాలి
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:50 PM
వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇవ్వాలి
మక్తల్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మంథన్‌గోడ్ ఫీడర్ కింద రె ౖతులకు నిరంతర విద్యుత్ అందించాలని డి మాండ్ చేస్తూ ఆదివారం మునిసిపాలిటీ పరిఽ దిలోని దండు క్రాస్‌రోడ్ వద్ద రైతులు ధర్నా ని ర్వహించారు. ప్రభుత్వం రైతులకు 24గంటలు అందిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నా రు. సరైన విద్యుత్ అందక పంటలు ఎండిపో తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 10గంటల కరెంటు సైతం ఇవ్వడం లేదన్నారు. ధర్నాకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్‌రెడ్డి సంఘీబావం తెలిపారు. కార్య క్రమంలో మదుసూధన్‌రెడ్డి, నరేందర్ రెడ్డి, నర్సింహారెడ్డి, బసిరెడ్డి, తిమ్మన్న, వెంకట్‌రెడ్డి రైతులు పాల్గొన్నారు.
దామరగిద్ద: మండలంలోని కానుకుర్తి గ్రామ రైతులు ఆదివారం నారాయణ పేట, యానగుంది రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. కరెంటు సమయానికి అందక పంటలు ఎండిపోయే ప రిస్థితి నెలకొందని రైతులు ఆవే దన వ్యక్తం చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న సర్పంచు నారాయణ, ఎస్‌ఐ నరేష్, మం డల విద్యుత్ అధికారి అనిల్ కు మార్ చేరుకొని విద్యుత్ సరఫరా అందేలా చూస్తామని హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో మొగుల ప్ప, అశోక్, రైతులు గోవిందప్ప, దేవేంద్రప్ప, చెంద్రప్ప, మోహన్, మహేష్ పాల్గొన్నారు.
నారాయణపేటరూరల్: మండలంలోని చిన్నజట్రం సబ్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మీపూర్ ఫీడర్ కింద వచ్చే గ్రామాలకు వ్యవసాయానికి రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరారు. ఆదివారం ఆయా గ్రామాల రైతులు చిన్నజట్రం సబ్‌స్టేషన్‌కు చేరుకుని తమ గోడును అధికారులకు విన్నవించారు.
కానుకుర్తిలో రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న రైతులు