ముగిసిన అండర్-17 క్రీడా పోటీలు
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:41 PM
ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌ఈఎస్‌ఐ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి క్రీ డా పోటీల్లో అండర్-17 విభాగం శుక్రవారం ముగిసింది.
- ఓవరాల్ చాంపియన్‌షిప్ ఎంజేపీ కల్వకుర్తి
కల్వకుర్తి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌ఈఎస్‌ఐ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి క్రీ డా పోటీల్లో అండర్-17 విభాగం శుక్రవారం ముగిసింది. ఈ విభాగంలో ఎంజేపీ కల్వకు ర్తి ఓవరాల్ చాంపియన్‌షిప్ చేసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పోటీలు ఈ నెల 11న ప్రారంభమై, 13వ తేదీన ముగిశాయని ప్రిన్సిపాల్ నాగ మణి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాల పరిధిలో 16 పాఠశా లల నుంచి 560మంది విద్యార్థులు మూడు రోజుల పాటు పోటీల్లో పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. కబడ్డీ, ఖోఖో, చెస్, వాలీబాల్, టెన్నికాయిట్‌తో పాటు లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిం చినట్లు చెప్పారు. శని, ఆదివారాల్లో అండర్-14, 19 విభాగాల పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ నెల 16న విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధ్యా యులు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.