భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:15 PM
భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో.. అది జీర్ణించుకోలేని భర్త చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలో చోటు చేసుకున్నట్లు ఎస్‌ఐ విక్రం తెలిపారు.
- కళ్లు దానం చేసిన కుటుంబ సభ్యులు
నవాబ్‌పేట, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో.. అది జీర్ణించుకోలేని భర్త చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలో చోటు చేసుకున్నట్లు ఎస్‌ఐ విక్రం తెలిపారు. గ్రామానికి చెంది న శేఖరయ్య (59) భార్య శంకరమ్మ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో శేఖరయ్య నిత్యం బాధపడుతూ.. శనివారం భార్య ను తలుచుని గ్రామస్థుల ఎదుట కంటతడి పెట్టుకున్నాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో తన పొలంలో ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. అన్న రాఘవేందర్ గుర్తించి కుమారులకు సమాచారం ఇచ్చి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. కాగా వైద్యుల సూచన మేరకు శేఖరయ్య కళ్లు దానం చేసినట్లు కుమారుడు మల్లికార్జున్ తెలిపారు.