Share News

ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూ విజయం

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:09 AM

ఉమ్మడి పాలమూరు జిల్లా లో శుక్రవారం జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ మద్ద తు తెలిపిన టీడబ్ల్యూయూ కూటమి ఘన విజయం సాధించింది.

ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూ విజయం
ఆర్టీసీ మహబూబ్‌నగర్‌ డిపోలో ఓటు వేసిన ఉద్యోగులు

- మహబూబ్‌నగర్‌ రీజియన్‌లో 10 డిపోలు

- గద్వాల, షాద్‌నగర్‌ డిపోలు మినహా అన్నింటా ఆధిక్యం

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పాలమూరు జిల్లా లో శుక్రవారం జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ మద్ద తు తెలిపిన టీడబ్ల్యూయూ కూటమి ఘన విజయం సాధించింది. మహబూబ్‌ నగర్‌ రీజియన్‌లో 10 బస్‌ డిపోలు ఉండగా, ఎనిమిది డిపోలను టీడబ్ల్యూ యూ కైవసం చేసుకున్నది. గద్వాల డిపోలో ఎంప్లాయీస్‌ యూనియన్‌, షాద్‌ నగర్‌ డిపోలో తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ విజయం సాధించాయి. కొల్లా పూర్‌, కోస్గి డిపోల్లో రెండు యూనియన్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది.

- మహబూబ్‌నగర్‌ డిపోలో టీడబ్ల్యూయూ రీజియన్‌లో 216 ఓట్లు, రాష్ట్రస్థా యిలో 225 ఓట్లు పోలయ్యాయి. ఎంప్లాయీస్‌ యూనియన్‌కు రీజియన్‌లో 159, రాష్ట్రస్థాయిలో 148 ఓట్లు వచ్చాయి.

ఫ వనపర్తి డిపోలో టీడబ్ల్యూయూకు రీజియన్‌లో 262 ఓట్లు రాగా, రాష్ట్ర స్థాయిలో 258 ఓట్లు, ఎంప్లాయీస్‌ యూనియన్‌కు రీజియన్‌లో 114 ఓట్లు, రా ష్ట్ర స్థాయిలో 126 ఓట్లు పడ్డాయి.

- నారాయణపేట డిపోలో 285 ఓట్లకు గాను 283 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇందులో టీడబ్యూయూకు రీజియన్‌లో 203, రాష్ట్ర స్థాయిలో 194 ఓట్లు రాగా, ఎంప్లాయిస్‌ యూనియన్‌కు రీజియన్‌లో 72, రాష్ట్ర స్థాయిలో 66 ఓట్లు వచ్చాయి.

- కోస్గి డిపోలో 110 ఓట్లకు గాను 107 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇందులో టీడబ్ల్యూయూకు రీజియన్‌లో 57, రాష్ట్రస్థాయిలో 55 ఓట్లు రాగా, ఎంప్లాయిస్‌ యూనియన్‌కు రీజియన్‌లో, రాష్ట్ర స్థాయిలో చెరో 46 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇరువర్గాల మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగడంతో ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలు రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో అధికారులు రీకౌంటింగ్‌ చేపట్టారు.

- కల్వకుర్తి డిపోలో 354 ఓట్లకు గాను 352 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడబ్ల్యూయూకు రీజియన్‌లో 295 ఓట్లు, రాష్ట్ర స్థాయిలో 28 ఓట్లు రాగా, ఎంప్లాయిస్‌ యూనియన్‌కు రీజియన్‌లో 26, రాష్ట్రస్థాయిలో 49 ఓట్లు వచ్చాయి.

- కొల్లాపూర్‌ డిపోలో 224 ఓట్లు పోల్‌ కాగా టీడబ్య్లూయూ కు 121, ఎం ప్లాయిస్‌ యూనియన్‌కు 101 ఓట్లు పోల్‌ అయ్యాయి. టీఎంయూ 20 ఓట్లతో సరిపెట్టుకుంది.

ఫ నాగర్‌కర్నూల్‌ డిపోలో మొత్తం 285 ఓట్లకు గాను, 279 ఓట్లు పోల్‌ అ య్యాయి. టీడబ్ల్యూయూకు రాష్ట్రస్థాయిలో 259, రీజియన్‌లో 267 ఓట్లు వచ్చా యి. ఎంప్లాయీస్‌ యూనియన్‌కు రాష్ట్రస్థాయిలో 9, రీజియన్‌లో 1 ఓటు మాత్ర మే వచ్చాయి.

- అచ్చంపేటలో టీడబ్ల్యూయూకు రీజియన్‌లో 300 ఓట్లు రాగా, ఎంపా యీస్‌ యూనియన్‌కు 5 ఓట్లు మాత్రమే పడ్డాయి.

- గద్వాల డిపోలో ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఘన విజయం సాధించింది. ఇక్కడ 371 ఓట్లుకు గాను 368 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఎంప్లాయిస్‌ యూనియన్‌కు రీజియన్‌లో 235 ఓట్లు రాగా, టీడబ్ల్యూయూకు కేవలం 119 ఓ ట్లు మాత్రమే వచ్చాయి.

- షాద్‌నగర్‌ డిపోలో 284 మంది ఓటర్లు ఉండగా, 282 మంది ఓటు వే శారు. టీఎంయూకు రీజియన్‌లో 145, రాష్ట్రస్థాయిలో 151 ఓట్లు వచ్చాయి. టీడబ్ల్యూయూకు రీజియన్‌లో 136, రాష్ట్రంలో 125 ఓట్లు పోలయ్యాయి.

Updated Date - Oct 10 , 2026 | 12:10 AM